టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Siva Koratala) తో చేస్తున్న ప్రాజెక్టు ఎన్టీఆర్ 30 ( NTR 30). ఇప్పటికే మోషన్ పోస్టర్ను విడుదల చేయగా..మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం జూన్ లేదా జులై నుంచి షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ఈ చిత్రం ఆగస్టుకు వాయిదా పడిందని తాజాగా మరో అప్ డేట్ తెరపైకి వచ్చింది. మేకర్స్ ఇప్పటికే సినిమా షెడ్యూల్ను రెడీ చేశారని, తాజా నిర్ణయం ప్రకారం ఎన్టీఆర్ 30 షూటింగ్ ఆగస్టు నుంచి షురూ కాబోతుందని తాజా సమాచారం.
ఈ మూవీ 6 నుంచి 7 నెలల పాటు చిత్రీకరణ జరుపుకోనుందట. 2023 మొదటి త్రైమాసికం నాటికి షూటింగ్ పూర్తి చేసి..వచ్చే వేసవి కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంపికపై కసరత్తు చేసే పనిలో కొరటాల అండ్ టీం బిజీగా ఉన్నారని టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
రత్నవేల్ సినిమాటోగ్రాఫర్. కాగా ఫీ మేల్ లీడ్లో ఎవరు కనిపించనున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.రీసెంట్గా రిలీజైన ఆర్ఆర్ఆర్ బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న తారక్ ఎన్టీఆర్ 30తోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.