NS Shankar | కన్నడ సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు, రచయిత ఎన్ఎస్ శంకర్ కన్నుమూత
NS Shankar | కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు ఎన్ఎస్ శంకర్ (67) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. సుదీర్ఘకాలం జర్నలిస్టుగా, రచయితగా, దర్శకుడిగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఆయన మరణం కన్నడ సినీ, సాహిత్య, పాత్రికేయ రంగాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
NS Shankar | కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు ఎన్ఎస్ శంకర్ (67) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. సుదీర్ఘకాలం జర్నలిస్టుగా, రచయితగా, దర్శకుడిగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఆయన మరణం కన్నడ సినీ, సాహిత్య, పాత్రికేయ రంగాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శంకర్, ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే వైద్య సహాయం అందించే ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
ఎన్ఎస్ శంకర్ 1997లో విడుదలైన ‘ఉల్టా పల్టా’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. విభిన్నమైన కథాంశాలు, సామాజిక అంశాలను తన సినిమాల్లో ప్రతిబింబించే దర్శకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. దర్శకుడిగానే కాకుండా కొన్ని చిత్రాల్లో నటుడిగా కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సినీ రంగంలోకి రాకముందు శంకర్ ప్రముఖ కన్నడ పత్రికలైన ‘ప్రజావాణి’, ‘లంకేశ్ పత్రిక’ల్లో జర్నలిస్టుగా పనిచేశారు. సమాజంలోని పలు అంశాలపై ఆయన రాసిన కథనాలు, వ్యాసాలు విశేష ఆదరణ పొందాయి. పాత్రికేయుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా దళిత సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలు విశేషమైనవిగా భావిస్తారు. సామాజిక అసమానతలు, పీడిత వర్గాల సమస్యలను తన రచనల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
సాహిత్యం, జర్నలిజం, సినిమా రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్ఎస్ శంకర్‌కు 2024లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం లభించింది. ఈ అవార్డు ఆయన సుదీర్ఘ సేవలకు లభించిన గొప్ప గౌరవంగా భావించబడింది. ఎన్ఎస్ శంకర్ మృతిపట్ల కర్ణాటక రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానంద తగడూరు సహా పలువురు పాత్రికేయ ప్రముఖులు ఆయన మరణాన్ని తీరని లోటుగా అభివర్ణించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

