జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కలయికలో మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ 30 (NTR 30) గ్లింప్స్ వీడియో ఒకటి షేర్ చేసి..సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు కొరటాల. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన కొరటాల నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
సాధారణంగా సినిమా చేస్తున్నపుడు డైరెక్షన్ డిపార్టుమెంట్ మాత్రమే కాకుండా ప్రొడక్షన్స్, డిస్ట్రిబ్యూర్లతో బిజినెస్ డీల్స్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారన్న టాక్ ఉంది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో స్ట్రాటజీ విషయంలో కొరటాల శివ డైలమాలో పడ్డట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి రిస్క్‌లు ఉండకుండా తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే కొరటాలకు కేవలం స్క్రిప్ట్, డైరెక్షన్ పనులపై మాత్రమే ఫోకస్ పెట్టాలని తారక్ సూచించాడట. ఈ రెండు కేటగిరీలు తప్ప మరే అంశాల్లో జోక్యం చేసుకోవద్దని కొరటాలను కోరినట్టు ఇన్ సైడ్ టాక్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
Read Also : Naga Shaurya | పార్టీ మూడ్‌లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!