Sankranthi Releases 2023 | ఆ ఐదుగురు హీరోల్లో రియల్ విన్నర్ ఎవరు?
సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్లో రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్ అయ్యే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు.
Sankranthi Releases | సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్లో రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్ అయ్యే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా..నేనా అనే రేంజ్లో పోటీ రసవత్తరంగా సాగింది. అందరి కంటే ముందుగా అజిత్ ‘తెగింపు’తో ప్రేక్షకులను పలకరించాడు. రిలీజ్ రోజునే ఈ మూవీ డివైడ్ టాక్ మూటగట్టుకుంది. దాంతో ఈ సినిమా తెలుగులో అంత ప్రభావం చూపలేకపోయింది. బుధవారం సోలోగా రిలీజ్ అవడంతో కోటీ వరకు ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ ఆ తర్వాత రోజు నుండి సౌండే లేదు.
ఇక గురువారం భారీ అంచనాల నడుమ రిలీజైన ‘వీరసింహా రెడ్డి’ కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్‌కు ముందు చేసిన హాడావిడితో వీరసింహకు ఓ రేంజ్లో బజ్ క్రియేట్ అయింది. దాంతో టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీ రేంజ్లో వచ్చాయి. కాగా ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పాత సినిమాలను మిక్సీలో రుబ్బి కొట్టాడని, డైలాగ్స్ ఓవర్‌గా ఉన్నాయిని, మితిమీరిన హింస ఉందని ఇలా పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి.
ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన ‘వాల్తేరు వీరయ్య’ కూడా జస్ట్ పాస్ మార్కులతో లాగించేశాడు. కేవలం ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సినిమా తెరకెక్కించారని, కొత్త సినిమా చూసినట్లే లేదని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రోటీన్ కమర్షియల్ ప్లాట్ తీసుకున్నాడని, అంతే రొటీన్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఏదో కానిచ్చేశాడని అంటున్నారు. అయితే వింటేజ్ మెగాస్టార్‌ను చూసినట్లుందని, సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఇదే బెటర్‌గా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
నాన్ వెజ్ సినిమాలు అటుంచుతే.. వెజ్ లాంటి ‘వారసుడు’ కూడా పండక్కి హిట్టు కొట్టలేకపోయాడు. తమిళంలో పర్వాలేదనిపించిన, తెలుగులో మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. అయితే కొందరు మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. కథ పాతదే అయినా కథనం బాగుందని, ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా పండక్కి ఎంజాయ్ చెయ్యొచ్చన్ని వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రిలీజైన ‘కళ్యాణం కమనీయం’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రతీ సంక్రాంతికి ఒక చిన్న సినిమా రిలీజై మంచి విజయం సాధిస్తుండటం గత కొన్నేళ్లుగా ఆనవాయితిగా వస్తుంది. అయితే ఈ సారి మాత్రం అలా జరుగలేదు. అసలు ఎలాంటి హైప్ లేకుండా విడుదలైన కళ్యాణం కమనీయం సినిమాకు.. కనీసం పాజిటీవ్ టాక్ వచ్చిన సేఫయిపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించడం లేదు.
ఇలా మొత్తానికైతే ఈ సంక్రాంతి కాస్త చప్పగానే సాగింది. బ్లాక్‌బస్టర్ హిట్టు అనే మాట పక్కన పెడితే కానీసం హిట్ అనే టాక్ కూడా ఏ ఒక్క సినిమాకు రాలేదు. అయితే వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టాక్‌తో సంబంధంలేకుండా మెజారిటీ ఆడియోన్స్ వస్తున్నారు. ఈ రెండు సంక్రాంతికి సేఫ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక వారసుడు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ హెల్ప్‌తో సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ ఈ సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

