శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘శ్వాగ్’. ‘రాజ రాజ చోర’ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 4న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా చిత్రంలోని ‘నీలో నాలో.. కదలాడు భావం ఈ రాగం..’ అంటూ సాగే మెలొడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. భువనచంద్ర రాసిన ఈ పాటను వివేక్ సాగర్ స్వరపరచగా, రాజేష్ కృష్ణన్, అంజనాసౌమ్య ఆలపించారు. ఈ నాస్టాల్జిక్ మెలొడీని శ్రీవిష్ణు, మీరాజాస్మిన్లపై దర్శకుడు తెరకెక్కించారు. ఈ పాటలో కాస్ట్యూమ్స్, కంపోజిషన్ అంతా 80s 90s రోజుల్ని గుర్తు చేసేలా ఉంది. దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.