Nora Fatehi | నటిగా, డ్యాన్సర్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది కెనడియన్ సుందరి నోరా ఫతేహి (Nora Fatehi). తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ నెట్టింట ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ఎక్కడైనా కనిపించిదంటే కెమెరాలన్నీ రౌండప్ చేస్తాయి.
తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బ్లూ షర్ట్, ప్యాంట్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. కెమెరాలన్నీ ఒక్క చోట చేరాయి. నోరా ఫతేహిని తమ తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు రిపోర్టర్లు. ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka)లో నోరాఫతేహి వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది. నోరాఫతేహి Madgaon Express, Crakk చిత్రాల్లో కూడా నటిస్తోంది.
ఎయిర్‌పోర్టులో నోరాఫతేహి..
Jet-setting in style: Nora Fatehi rocks a chic blue outfit, black sunglasses, and a statement handbag at the airport ✈️🕶️👜 #NoraFatehi #DeepikaPadukone #SalmanKhan #AliaBhatt #DishaPatani #SaraAliKhan #KiaraAdvani #KrithiShetty #TamannaahBhatia #KanganaRanaut #viralvideo #WATCH pic.twitter.com/wNUSuNiwAB
— Jadolya (@JadolyaNews) September 21, 2023