Rajinikanth | నా స్టార్డమ్ అక్కడ పని చేయలేదు.. ఆ అనుభవం నా అహాన్ని అణిచివేసింది: రజనీకాంత్
Rajinikanth | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్.
Rajinikanth | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల ఆశ్రమంకి సంబంధించిన 45వ వార్షికోత్సవం మరియు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తలైవర్, ఆధ్యాత్మికత ముందు తన స్టార్డమ్ చాలా చిన్నదని పేర్కొన్నారు. గతంలో కేవలం రెండు రోజులు గడపడానికి ఆశ్రమానికి వచ్చిన తాను, అక్కడి ప్రకృతి ఒడిలో ప్రశాంతతను పొంది ఏకంగా 15 రోజుల పాటు ఉండిపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకరోజు గురుదేవ్ సూచన మేరకు ఆశ్రమంలో కలియతిరుగుతున్నప్పుడు వందలాది మంది ఉన్నప్పటికీ తనను కనీసం ఒక్కరు కూడా గుర్తుపట్టకపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని రజనీకాంత్ వివరించారు.
సాధారణంగా తాను ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడతారని, కానీ ఆశ్రమంలోని వారు కనీసం తనవైపు చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. అక్కడ తమిళనాడుకు చెందిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ తనను పట్టించుకోలేదని, తాను అభివాదం చేస్తున్నా కనీసం స్పందించలేదని తెలిపారు. ఈ ఘటన తనలోని అహాన్ని ఒక్కసారిగా అణచివేసిందని, స్టార్డమ్ అనేది తాత్కాలికమని, ఆధ్యాత్మికత ద్వారా వచ్చే శాంతి మాత్రమే శాశ్వతమని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. సినిమాల్లో గుర్తింపు మనిషితో పాటే అంతమైపోతుందని, కానీ ఆధ్యాత్మిక ప్రయాణం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
VIDEO | Recalling his earlier visit to the Art of Living, actor Rajinikanth (@rajinikanth) brought the house down with his humorous take, said, ‘nobody even looked at me’.#Rajinikanth pic.twitter.com/JPZGgxtLMv
— Press Trust of India (@PTI_News) May 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

