ప్రస్తుతం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. డీవివి దానయ్య సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది . అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతుంది.
గతంలో బాహుబలి సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఇద్దరు హీరోలకు సంబంధించిన సినిమా ఈవెంట్ కావడంతో అభిమానులు భారీగా తరలి వస్తారు. ఇలాంటి పరిస్థితులలో అంత మందితో వేడుక జరపించడం కష్టమని భావిస్తున్న జక్కన్న టీవీ షోస్ ద్వారా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాడట. ఓటీటీ,టీవీ, రేడియో, యూట్యూబ్, సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!