TVK Vijay | టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత, నటుడు విజయ్‌కు తమిళనాడు పోలీసులు షాకిచ్చారు. టీవీకే రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 16న ఈరోడ్‌లో విజయ్ రోడ్ షోకు టీవీకే సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్ షోకు 75 వేల మంది వరకు వస్తారని పోలీసులు అంచనా వేసినట్టు సమాచారం. ఈ మేరకు తొక్కిసలాట జరిగే ప్రమాదముందని భావిస్తున్న పోలీసులు కార్నర్ మీటింగ్‌కు అనుమతిని నిరాకరించారు.
మరోవైపు ఫంక్షన్ హాల్లో సమావేశానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది.
విజయ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు