RRR OTT | ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రిపుల్ఆర్ విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది. బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం మే 20న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ చిత్రం T VOD (ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్) విధానంలో అందుబాటులో ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జీ-5లో చూడాలంటే రూ.100 పెట్టి రెంట్‌కు తీసుకోవాలని జీ-5 సంస్థ తెలిపింది. అయితే దీనిపై సినీ ప్రేమికులు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు అధిక ధరకు టిక్కెట్లు కొనుగోలు చేశామని, ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ చేసుకున్న ఓటీటీలలో మళ్ళీ డబ్బులు పెట్టి చూడటం ఏంటని నెటీజన్లు మేకర్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. దాంతో జీ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పే-పర్-వ్యూ గా స్ట్రీమింగ్ చేసే విధానం నుంచి తప్పుకుంది. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. కేవలం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు ఉచితంగా ఆర్ఆర్ఆర్ సినిమాను చూడొచ్చు.