Kajal Agarwal | ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ( Acharya Pre release Event ) చూసిన తర్వాత ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక్కరు కూడా కాజల్ గురించి మాట్లాడలేదు.. కనీసం ఆమె పేరు ఎత్తలేదు. అసలు సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్న సంగతి కూడా అందరూ మరిచిపోయారు. ఇదే ఇప్పుడు తలుచుకొని కాజల్ అభిమానులు బాధ పడుతున్నారు. ఫంక్షన్‌కు రాకపోతే తన గురించి మాట్లాడటం మరిచిపోతారా అంటూ కాజల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
రెండేండ్ల క్రితం గౌతమ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న కాజల్ ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగానే ఆమె ఫంక్షన్‌కు రాలేదు. ఇదిలా ఉంటే పెండ్లికి ముందే కాజల్ ఆచార్య సినిమాను ఒప్పుకుంది. నిజానికి ముందుగా ఈ సినిమాకు త్రిషను హీరోయిన్గా అనుకున్నారు. కానీ చివరకు ఆమె స్థానాన్ని కాజల్ రీప్లేస్ చేసింది. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవితో కాజల్ మరోసారి జోడీ కట్టింది. దీంతో ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లోనూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కాజల్ గురించి ఎవరూ మాట్లాడకపోవడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యకరంగా అనిపించింది. దర్శకుడు కొరటాల శివ నుంచి మొదలు పెట్టి చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే ఎవరూ అసలు కాజల్ గురించి మాట్లాడలేదు. దీంతో ఫ్యాన్స్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదృశ్చికంగా జరిగిందా? లేదంటే కావాలనే కాజల్ పేరు మరిచిపోయారా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
“Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.”
“Kajal Aggarwal | కొడుకు పుట్టాక డబుల్ హ్యాపీమూడ్‌లో కాజల్..ట్రెండింగ్‌లో తాజా స్టిల్”
కాజల్ గురించి ఆమె చెల్లె నిషా అగర్వాల్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..”
“Ram Charan | ఆచార్యలో రాంచరణ్ కనిపించేది ఎంతసేపంటే..?”
“Kajal Aggarwal | క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న కాజల్ అగర్వాల్..”