టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏప్రిల్ 19న పండంటి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. తమ ముద్దుల కొడుకుకు (baby boy) కాజల్- గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu ) దంపతులు నీల్కిచ్లూ (Neil Kitchlu) అని నామకరణం చేశారు. ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ కాన్పిడెన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రెగెన్సీ సమయంలో కూడా ఫొటో షూట్‌చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయింది.
కాగా తాజాగా డెలవిరీ తర్వాత కాజల్ ఓ స్టిల్‌ను నెట్టింట షేర్ చేసింది. గోల్డెన్ కలర్ డ్రెస్‌లో హొయలుపోతూ చాలా హ్యాపీ మూడ్‌లో కెమెరాకు స్టన్నింగ్ పోజులిచ్చింది. కొడుకు పుట్టిన వేలావిశేషంతో కాజల్ ఆనందం మరింత రెట్టింపైనట్టు ఈ స్టిల్‌తో అర్థమవుతుంది. పుట్టిన కొన్ని క్షణాల్లోనే నా ఛాతీపై నీల్ని పట్టుకోవడం వర్ణించలేని అనుభూతి. ఆ ఒక్క క్షణం ప్రేమలోని లోతైన అనుభూతి నాకు అర్థమయ్యేలా చేసింది. నాకు విపరీతమైన కృతజ్ఞతా భావాన్ని కలిగించింది..అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది కాజల్ తాజా ఫొటో ఇపుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన ఆచార్యలో ఫీ మేల్‌లీడ్ రోల్ చేస్తోంది కాజల్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలవుతుంది. రాంచరణ్ ఈ ప్రాజెక్టులో కీలకపాత్రలో నటిస్తున్నాడు.