‘ఈ సినిమా షో ఇప్పటికే చాలామందికి వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 6న విజయవాడలో, 8న తిరుపతిలో షోలు వేస్తున్నాం. విడుదల తేదీకి ముందే ఓవర్సీస్లో హ్యాపీడేస్, శతమానంభవతి సినిమాల షోలు వేశాం. అవి పెద్ద హిట్స్ అయ్యియి. ఆ సెంటిమెంట్‌తోనే ఈ మూవీని కూడా ఓవర్సీస్లో ఈ 10న విడుదల చేస్తున్నాం. 11న ఇక్కడ ప్రీమియర్స్ వేసి, 12న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని దిల్‌రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మించిన చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ఈ చిత్రానికి సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడారు. ఈ సినిమా ఏ ఒక్కర్నీ నిరాశపరచదనీ, ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని సుహాస్ చెప్పారు. ఈ సినిమా ఆద్యంతం ఐడియాలజీలపై ప్రయాణమేనని, తండ్రి, గ్రాండ్ మదర్, భార్య, భర్త.. ఇలా అందరికోణంలో ఈ కథ సాగుతుందని నిర్మాత హర్షిత్‌రెడ్డి చెప్పారు. ఇంకా దర్శకుడు సందీప్‌రెడ్డి, కథానాయిక సంగీర్తన కూడా మాట్లాడారు.