గత ఏడాది కరోనా ఎఫెక్ట్ వలన సినీ పరిశ్రమ దాదాపు 9 నెలలు స్తంభించింది. చాలా సినిమాల షూటింగ్స్, రిలీజ్లు వాయిదా పడ్డాయి. అయితే కరోనా కాస్త శాంతించడంతో థియేటర్స్లో సినిమాలు విడుదలయ్యాయి. మిగతా సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. కాని కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ డేట్ వాయిదా వేసినట్టు అఫీషియల్ ప్రకటన చేయకపోగా, ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్ పోస్టర్లో రిలీజ్ డేట్ అక్టోబర్ 13 అనే ఉంది. దీంతో మూవీని వాయిదా వేసే అవకాశం ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. ఇక జూలై 16న విడుదల కావలసి కేజీఎఫ్ 2 చిత్రం కూడా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. జూలై 16న సెకండ్ ఛాప్టర్ కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఉన్న అపోహలు తొలగిపోయాయి.