తిరుమల: ప్రముఖ నటి నివేదా థామస్ (Nivetha Thomas) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందం కలిసి తిరుమల వెళ్లిన ఆమె వేంకటేశ్వర స్వామివారిని దర్శింకున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘35-చిన్న కథ కాదు’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సైకాలజీ, ఫన్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని.. బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తిరుపతి వెళ్లిన టీమ్.. ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.