Nivetha Thomas | ‘మన భారతీయ సమాజంలో 22 ఏండ్లకే పెళ్లెప్పుడని అడుగుతుంటారు. అందుకే హౌస్‌వైఫ్ (గృహిణి) పాత్ర చేయడం ఇబ్బందిగా అనిపించలేదు. ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా అభిమతం’ అని చెప్పింది కథానాయిక నివేతా థామస్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘35-చిన్న కథ కాదు’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. కిషోర్ ఈమాని దర్శకుడు. ఈ సందర్భంగా శనివారం నివేతా థామస్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…