Nivetha Pethuraj | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే అనూహ్యంగా నివేదా తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ ఫోటోలన్నింటినీ తొలగించడమే కాకుండా, అతడిని అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో రాజ్‌హిత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వైరల్ కావడంతో, నివేదా పెళ్లి రద్దయ్యిందనే ప్రచారం బలపడింది. ఈ అంశంపై ఆమె అధికారికంగా స్పందించకపోయినా, నెటిజన్లు మాత్రం బ్రేకప్ జరిగిందని భావిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య నివేదా మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబోయే భర్త కోసం సినిమాలను పక్కన పెట్టిన ఆమె, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్ పాత్రలతో పాటు, కీలకమైన సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నటిగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే నివేదా, ఈసారి మరింత బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలతో నటిగా తన ప్రతిభను చాటుకుంది.
అలాగే అల వైకుంఠపురములోలో కీలక పాత్ర పోషించి మెప్పించిన ఆమె, రెడ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మరో కోణాన్ని చూపించింది. బ్లడీ మేరీలో టైటిల్ రోల్, దాస్ కా ధమ్కీలో నటనతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ZEE5లో విడుదలైన ‘పరువు’ వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. కేవలం నటనలోనే కాకుండా, ప్రొఫెషనల్ కార్ రేసింగ్‌లో కూడా తన ప్రతిభను చూపించిన నివేదా, మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను పక్కన పెట్టి, మళ్లీ సినిమాల్లో బిజీ కావడానికి సిద్ధమవుతున్న నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.