Nithin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, భార్య షాలినీ దంపతులకు గతేడాది కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్ 6న ఈ జంటకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే అప్పటి నుంచి చిన్నారి ఫోటో గానీ, వీడియో గానీ సోషల్ మీడియాలో విడుదల చేయలేదు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు నితిన్. కృష్ణాష్టమి రోజున తన బాబు పేరును ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు నితిన్. తన కొడుకుకు ‘అవ్యుక్త్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.“ఈ జన్మాష్టమికి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా కొడుకు పేరు అవ్యుక్త్ అని సంతోషంగా ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో ఎప్పటికీ ఓ చిన్న కృష్ణుడిగా ఉండిపోతాడు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు నితిన్. ఈ పేరు విన్న తర్వాత నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పేరు భలే వెరైటీగా ఉందని అంటున్నారు.
‘అవ్యుక్త్’ అనే పేరుకు శాశ్వతమైనదీ, స్వచ్ఛతను సూచించేదీ అనే అర్థాలు ఉన్నాయి. హిందూ తత్వంలో ఈ పదాన్ని పరమాత్మ లేదా ప్రకృతి మూలం అనే అర్థంలో వాడతారు. న్యూమరాలజీ ప్రకారం, ఈ పేరున్నవారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ధైర్యం, నాయకత్వ లక్షణాలు వారిలో కనిపిస్తాయి.నితిన్-షాలినీ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది తల్లిదండ్రులుగా మారారు. దాదాపు 11 నెలల తర్వాత కుమారుడికి పేరు పెట్టారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, నితిన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అంతకు ముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమాలు చేస్తున్నా కూడా నితిన్‌కి మంచి హిట్ అనేది రావడం లేదు. ఎల్లమ్మ చిత్రం అయిన నితిన్‌కి మంచి విజయం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.