తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆర్య (Arya). ఈ హీరో ప్రస్తుతం లీడ్ రోల్లో ‘కెప్టెన్’ (Captain)సినిమా చేస్తున్నాడు. శక్తి సౌందర్ రాజన్ (Shakthi Sounderajan) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తోండగా..సిమ్రాన్ కీలకపాత్ర పోషిస్తోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలు పంచుకున్నాడు ఆర్య.
కెప్టెన్ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండనుందన్నాడు ఆర్య. సాధారణంగా ఆర్మీ సినిమాలంటే పాకిస్థాన్ కానీ, ఉగ్రవాదులు కానీ శత్రువులుగా ఉంటారు. కానీ ఈ సినిమాలో ప్రత్యేకమైన పరిస్థితులుంటాయి. వాటిని ఎలా అధిగమించారనే నేపథ్యం ఉంటుంది. శత్రువును వీఎఫ్ఎక్స్ తో సృష్టించడం జరిగింది. ఇది ఛాలెంజ్‌తో కూడుకున్నది. వీఎఫ్ఎక్స్ పార్టు చాలా కష్టతరమైంది.. వీఎఫ్ఎక్స్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేయాల్సి వచ్చింది. సమయం కూడా ఎక్కువ పట్టిందన్నాడు ఆర్య.
శ్రేష్ఠ్ మూవీస్ చేతికి తెలుగు వెర్షన్..
కెప్టెన్ తెలుగు వెర్షన్‌ను శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తుందని ఆర్య చెప్పాడు. చాలా కాలంగా నితిన్ నాకు మంచి స్నేహితుడు. విక్రమ్ సినిమాను ప్రమోట్ చేసిన తీరును మేమంతా చూశాం. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయగల ఉత్తమమైన వ్యక్తులు వారేనని నాకనిపించిందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం ఖాయమని అన్నాడు ఆర్య.
Read Also : Naga Shaurya | పార్టీ మూడ్‌లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!