కొన్ని కథలు బోర్ కొట్టవు.. అవి ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలాంటి కొన్ని అరుదైన కథల్లో జయం సినిమా కూడా ఉంటుంది. తేజ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ లాంటి హీరోను తెలుగు ఇండస్ట్రీకి అందించింది జయం. అలాగే గోపీచంద్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. జయం కంటే ముందే 2000లో తొలి వలపు సినిమా చేసాడు గోపీచంద్. కానీ అది డిజాస్టర్ కావడంతో రెండేళ్ళ గ్యాప్ తీసుకుని జయం సినిమాలో విలన్ గా పరిచయం అయ్యాడు.
2002లో విడుదలైన ఈ సినిమా విడుదలై నేటికి 19 ఏళ్లు గడిచింది. జూన్ 14, 2002న విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్‌కు కావాల్సిన పునాది అప్పుడే గట్టిగా వేసింది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన జయం అప్పట్లోనే 15.16 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను తమిళంలో అదే పేరుతో రీమేక్ చేసారు. అక్కడ కూడా విలన్ గా గోపీచంద్ నటించాడు. ఈ సినిమాతోనే ఎడిటర్ మోహన్ తనయుడు రవి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో జయం రవి అయిపోయాడు. ఈ సినిమా అప్పట్లో సాధించిన వసూళ్లు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 4.70 కోట్లు
సీడెడ్- 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.75 కోట్లు
ఈస్ట్- 0.87 కోట్లు
వెస్ట్- 0.82 కోట్లు
గుంటూరు- 1.17 కోట్లు
కృష్ణ- 0.96 కోట్లు
నెల్లూరు- 0.65 కోట్లు
ఏపీ + తెలంగాణ – 13.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 1.79 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 15.16 కోట్లు
19 ఏళ్ళ కింద జయం సినిమాను 3.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసారు. నితిన్ ఎవరో తెలియకపోయినా తేజపై ఉన్న నమ్మకంతో భారీ రేట్లకు సినిమాను కొన్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాలేదు. నితిన్ కెరీర్ అద్భుతంగా ఆరంభమైంది. ఎవ్వరూ ఊహించని విధంగా 15.16 కోట్ల షేర్ వసూలు చేసి అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్లకు 11.46 కోట్ల లాభాలు అందించింది. ఈ సినిమాతో నితిన్, సదా, సుమన్ శెట్టి సహా 45 మంది నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది