హీరో నితిన్‌కు ‘భీష్మ’ వంటి హిట్ చిత్రాన్ని అందించాడు దర్శకుడు వెంకీ కుడుముల. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. హ్యూమరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల కిత్రం విడుదల చేసిన నితిన్ క్యారెక్టర్ టీజర్‌కు మంచి స్పందన లభించింది.
ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. సినిమాకిది హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృంద పేర్కొంది. నితిన్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ఆర్ట్: రామ్‌కుమార్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.