Nithiin | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన భీష్మ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు కలిసి రెండో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. VNRTrioగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్టులో భీష్మ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika mandanna) నటిస్తుందని చాలా రోజుల క్రితమే అప్డేట్ కూడా అందించారు. అయితే రష్మికను రీప్లేస్ చేస్తున్నారని వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై నితిన్ తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉంది. హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెక్ట్స్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నా డైరెక్టర్ వెంకీ కుడుముల అభిప్రాయపడ్డారు. శ్రీలీలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. శ్రీలీల తెలుగమ్మాయి కావడం మరింత కలిసొస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో కూడా శ్రీలీలనే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుందని తెలిసిందే. తాజా కామెంట్‌తో శ్రీలీల-నితిన్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా కానుందని అర్థమవుతోంది.
టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ పనులు షురూ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, డైరెక్టర్ వెంకీ కుడుముల మ్యూజిక్ సిట్టింగ్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్.
A sensational album for #VNRTrio guaranteed 💥💥
Director @VenkyKudumula, Music Director @gvprakash and Lyricist @LyricsShyam begin the music sittings for the adventurous entertainer ❤️🔥@actor_nithiin @iamRashmika pic.twitter.com/YOrKFvJOlT
— Mythri Movie Makers (@MythriOfficial) June 6, 2023
VNRTrio మూవీ లాంఛ్..
Few candid moments from #VNRTrio opening ceremony 🤩
Mega⭐ @KChiruTweets Garu Graced the Pooja Ceremony ✨@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/RXHc4dezHZ
— YouWe Media (@MediaYouwe) March 24, 2023