Nithiin | చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో ఒకరు నితిన్. చివరగా తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఫైనల్‌గా తన కొత్త ప్రాజెక్ట్ 36వ సినిమాను ప్రకటించాడు. ఈ సారి నిఖిల్ హీరోతో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో నిఖిల్‌కు మంచి బ్రేక్ అందించాడు డైరెక్టర్ వీఐ ఆనంద్.
చివరగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వీఐ ఆనంద్ తాజాగా నితిన్‌తో సినిమా చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో రాబోతున్న ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. గుబురు గడ్డంతో ఉన్న నితిన్ సిగరెట్ తాగుతుండటం చూడొచ్చు. ఇంతకీ వీఐ ఆనంద్ నితిన్‌తో ఎలాంటి సబ్జెక్టును ప్లాన్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందనే వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది నితిన్ టీం. మరి నిఖిల్‌ను బ్రేక్ అందించిన వీఐ ఆనంద్ నితిన్‌కు కూడా మంచి సక్సెస్ అందించాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తూ.. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. నో బాడీ.. నో రూల్స్ క్యాప్షన్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రీ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
NO BODY…NO RULES
The rules of reality just changed. Very eager to start the journey with my brother @Dir_VI_Anand & @srinivasaaoffl garu 😊
@SS_Screens pic.twitter.com/hrO6GRMPvq
— nithiin (@actor_nithiin) January 25, 2026
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్