Actor died : నటుడు నిర్మల్ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నిర్మల్ బెన్నీ స్నేహితుడు, సినీ నిర్మాత సంజయ్ పడియూర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
నిర్మల్ బెన్నీ మలయాళ సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఆమెన్ సినిమా అతనికి మలయాళ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. బెన్నీ 2012లో నవగతర్కు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను ఐదు సినిమాల్లో నటించారు. సినిమాలతోపాటు యూట్యూబ్ వీడియోల్లో కూడా బెన్నీ నటించారు. బెన్నీ మృతికి సంజయ్ పడియూర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.