Swayambhu | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ స్వయంభు (SWAYAMBHU). Nikhil 20గా నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే వార్త రాబోతుందని చెప్పింది నిఖిల్ టీం. ఉత్తేజాన్ని అందించే, జ్ఞానోదయాన్ని కలిగించే నిఖిల్ స్వయంభు ప్రయాణం.. మోస్ట్ ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందంటూ మేకర్స్ తెలియజేశారు. ఇంతకీ ఆ ఆసక్తికర వార్త ఏంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ స్వయంభు చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
‘Exciting & Enlightening’@actor_nikhil reflects on his journey of Swayambhu ❤🔥
The most awaited and exciting announcement from #Swayambhu is dropping soon!@actor_nikhil @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @DOPSenthilKumar @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/cJPJ9e2rjX
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2025
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్