2007లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha). ఈ చిత్రం విడుదలై అక్టోబర్ 2కు 14 ఏళ్లు పూర్తవుతుంది. నిఖిల్ టాలీవుడ్ (Tollywood)లో 14 ఏళ్ల కెరీర్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తనకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశాడు నిఖిల్.
14 ఏళ్ల కిత్రం ఇదే రోజు. హ్యాపీడేస్ చిత్రంతో నా ప్రయాణం మొదలుపెట్టా. 2021వ సంవత్సరం 18 పేజెస్ చిత్రంతో నా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. నాకు ఆశీస్సులు అందించిన అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ములకు సదా కృతజ్ణుడిని అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. హ్యాపీడేస్ లో రాజేశ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిగా కనిపించాడు నిఖిల్. ఈ చిత్రంలో నిఖిల్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. హ్యాపీడేస్ ఇచ్చిన గుర్తింపుతో పరశురాం డైరెక్షన్ లో యువత సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
14 Years Back on this day… I started my Journey with #HappyDays nd still going on in 2021 with #18Pages
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 2, 2021
Thanks to you all for blessing me and @sekharkammula sir for giving me this opportunity… ever grateful to him 🙏🏽 pic.twitter.com/OF9UNN8st5
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తో కలిసి 18 పేజెస్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. చందూమొండేటి డైరెక్షన్లో కార్తికేయ 2 లో నటిస్తున్నాడు. కాలభైరవ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి