టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ని సీపీ సజ్జనార్ శాలువాతో సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన చేసిన సేవలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో నిఖిల్‌ని నిఖిల్‌ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తనకు ఈ ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు.
తన ట్విట్టర్లో సజ్జనార్ సత్కరిస్తున్న వీడియోని షేర్ చేసిన నిఖిల్… ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్‌లో చేసిన పనిని గుర్తించి సీపీ సజ్జనార్‌గారు ఇలా సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను..’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. నిఖిల్‌కు పలువురు సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘18 పేజెస్’ చిత్రం ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తీస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
Honoured to be Felicitated & Recognised by the Commisioner of Police VC. Sajjanar Sir for COVID Related Work During the second wave and Interacting with the frontline Covid Police Warriors. #covid_19 #covid pic.twitter.com/DlQLZp0DLp
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 13, 2021