Niharika – Vishwak Sen | టాలీవుడ్లో మెగా కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుండగా, ఆయన బాటలో ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోలు అశేష ప్రేక్షకాదరణ సంపాదించారు. ఈ ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రమే. తొలుత యాంకర్‌గా రాణించిన ఈ భామ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది. అయితే ఇటీవల నిర్మాతగా మారిన ఆమెకు ఆ రంగంలో మంచి విజయం దక్కింది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా కూడా బిజీగా గడుపుతోంది.
ఇలాంటి సమయంలో నిహారిక, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో కలిసి ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. “ఇది ఎప్పుడు షూట్ చేశారు?”, “ఇద్దరికీ ముందే పరిచయం ఉందా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఆ వీడియో చూస్తే ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన వీడియో అని అర్థమవుతోంది. అయినప్పటికీ ఈ పాత వీడియో మళ్లీ బయటకు రావడంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, నిహారిక కాలేజీ రోజుల్లో విశ్వక్ సేన్‌కు సీనియర్‌గా ఉన్నట్టు ఒక సినిమా ఈవెంట్లో చెప్పింది. ఇప్పుడు ఆ సీనియర్-జూనియర్ జంట వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ టాలీవుడ్ యువ హీరోలలో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా హీరోగా ఉన్నాడు. మనోడు ఎంతో డెడికేషన్‌తో సినిమాలు చేస్తున్నా కూడా సరైన సక్సెస్‌లు రావడం లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. తదుపరి చిత్రంతో అయిన విశ్వక్ సేన్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.