Niharika | గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై అంచనాలు మించి భారీ విజయాన్ని సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా కాంబో మళ్లీ రిపీట్ కానుందన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ యదు వంశీ , నిర్మాత నిహారిక కొణిదెల మళ్లీ కలిసి కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ కొత్త సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాతో 11 మంది హీరోలు , 4గురు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.18.5 కోట్లు థియేట్రికల్ వసూళ్లు , రూ.6 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించి మొత్తం రూ.24.5 కోట్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అవార్డుల రేసులో కూడా ‘కమిటీ కుర్రోళ్లు’ దుమ్ము రేపింది. సైమా 2025లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల, బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్ అవార్డ్ అందుకున్నారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో కూడా రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను దక్కించుకుంది. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు యదు వంశీ దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా మరో ప్రాజెక్ట్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఫ్యాంటసీ–కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.