మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక చాలా చలాకీ పిల్ల. బుల్లితెర, వెండితెరపై అదరగొట్టింది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తూ.. పలు వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది. ఈ క్రమంలో నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. జీ5 ఓటీటీలో నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ అమ్మడు ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై పలు విషయాలు షేర్ చేసుకుంది.
ప్రోమోలో నిహారిక తెగ నవ్వుతూ కనిపించింది. అయితే తన తండ్రి నాగబాబు తనని ‘మమ్మీ’ అని పిలుస్తారని.. సోదరుడు వరుణ్ తేజ్ పరిస్థితులను బట్టి నిహా అని.. బాగా ముద్దొస్తే బంగారం.. ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని నవ్వుతూ చెప్పింది.చిన్నప్పుడు తన తండ్రి ఒకసారి కొట్టారని.. వరుణ్ తేజ్ తో విపరీతంగా పొట్లాడానని నిహారిక స్పష్టం చేసింది.
చిరంజీవి ,పవన్ కల్యాణ్ ,నాగబాబుల్లో ఎవరంటే బాగా ఇష్టమని అడగ్గా.. తన తండ్రి అంటే ఎక్కువ ఇష్టమని.. ఆయన లేకపోతే చచ్చిపోతానని అని మెగా డాటర్ చెప్పుకొచ్చింది. ఇక తనతో పాటుగా తన తండ్రి,చిన్న మేనత్త ,సాయి ధరమ్ తేజ్ లకు కాస్త మెంటల్ ఉందని చెప్పి నవ్వులు పూయించింది. ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.