సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై రెండేళ్ల క్రితం పెద్ద పోరాటమే జరిగింది. పరిశ్రమలో స్త్రీలకు రక్షణ లేదంటూ కొందరు నటీమణులు ఉద్యమాలే చేశారు. అయితే.. అందుకు భిన్నమైన అనుభవాన్ని కెరీర్ తొలినాళ్లలో కథానాయిక నిధి అగర్వాల్ చవిచూశారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఆ అనుభవాన్ని స్వయంగా వెల్లడించారు.
‘మున్నా మైకేల్’ నటిగా నా తొలి సినిమా. టైగర్ ష్రాఫ్ కథానాయకుడు. ఆ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత ఆ టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్‌పై సంతకం చేయించుకుంది. అయితే.. నేను చదవకుండా సంతకం చేశాను. తీరా కొన్ని రోజుల తర్వాత ఆ కాంట్రాక్ట్‌లో ఏముందో తెలిసింది. నిజంగా ఆశ్చర్యపోయా. అందులో సినిమాకు సంబంధించిన విధివిధానాలతోపాటు ‘నో డేటింగ్’ అనే షరతు కూడా పెట్టారు.
సినిమా పూర్తయ్యేంతవరకూ నేను హీరోతో డేట్ చేయకూడదు అనేది దాని సారాంశం. నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టి పెట్టరని వారి ఉద్దేశ్యం. ఆ సంఘటన సినిమా పరిశ్రమపై నాకు గౌరవాన్ని పెంచింది. అవసరాల కోసమే కాదు. అభిరుచితో సినిమాలు తీసేవాళ్లూ ఇండస్ట్రీలో ఉంటారు.’ అంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు నిధి అగర్వాల్.