Nidhi Agarwal | తొలినాళ్లలో విడుదలైన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు పెద్దగా ఆడకపోయినా.. ‘ఇస్మార్ట్‌శంకర్’తో బ్లాక్బాస్టర్ హిట్ కొట్టేసింది నిధి అగర్వాల్. కౌంట్ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నది ఈ అందాలనిధి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న సినిమాలు సామాన్యమైనవి కావు. వాటిలో ఒకటి పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ కాగా, రెండోది ప్రభాస్ ‘రాజా సాబ్’.
ఇద్దరు సూపర్స్టార్లతో ఒకేటైమ్‌లో జతకట్టి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది నిధి అగర్వాల్. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో తన సినిమాల గురించి మాట్లాడింది నిధి. ‘ పవన్ సార్ ‘హరిహరవీరమల్లు’లో రాజుల కాలంనాటి పాత్ర చేస్తున్నా.
ఇందులో నా పాత్ర గమ్మత్తుగా, రొమాంటిక్‌గా ఉంటుంది. వపన్సార్, నేనూ కలిసి నటించిన సన్నివేశాలు పొయెటిక్‌గా ఉంటాయి. ఓల్డ్ క్లాసిక్స్ చూసిన ఫీల్ కలుగుతుంది. అలాగే.. ప్రభాస్ ‘రాజా సాబ్’లో కూడా భిన్నమైన పాత్ర చేస్తున్నాను. ఈ తరహా సినిమా చేయడం ప్రభాస్‌తో పాటు నాకూ కొత్తే. ఏదేమైనా ఇద్దరు సూపర్స్టార్లతో కలిసి నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.