అబ్బాబ్బా.. సూపర్ టైటిల్స్.. అసురుల దండయాత్ర..

Ravanasura and bimbisara | ఈ రోజుల్లో ఒక సినిమా పై అంచనాలు పెరగాలి అంటే ముందు టైటిల్ అద్భుతంగా ఉండాలి. అది కానీ సరిగ్గా సెట్ అయింది అంటే ఈ సినిమాపై ఆసక్తి ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. అందుకే దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో అసురుల పేరుపై టైటిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. రాక్షసుల పేరుతో తమ సినిమాలకు టైటిల్స్ పెడుతున్నారు మన దర్శకులు.
రెండేళ్ల కింద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు అనే సినిమాతో వచ్చాడు. తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రావణాసుర టైటిల్ ఖరారు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్ రావణాసుర సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు రావణాసుర అనే టైటిల్ పెట్టారు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో వస్తున్న సినిమాకు బింబిసార అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. బింబిసార కూడా ఒక అసురుని పేరు. ఏకంగా మూడు భాగాలుగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు నరకాసురుడు పేరుతో ఒక సినిమా వస్తుంది. అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా విడుదలైంది. నరకాసుర పేరుతో మరో సినిమా కూడా వస్తుంది.
ఇక అప్పట్లో నారా రోహిత్ అసుర అనే సినిమా చేశాడు. ఈ మధ్య ధనుష్ అసురన్ అనే టైటిల్ తో సినిమా చేసి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇదే సినిమాను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు చాలా మంది హీరోలు బాక్సాఫీస్ పై అసురుల పేరుతో దండయాత్ర చేస్తున్నారు. మరి వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో కొన్ని మైథలాజికల్ కాన్సెప్టుతో వస్తుంటే మరికొన్ని సోషల్ సినిమాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

