చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో సుమారు 25 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో సుమారు 25 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామ సమీపంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో విద్యార్థులు పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు, స్థానిక చేవెళ్ల పోలీసులతో కలిసి అక్కడ మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన కొందరు విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ పార్టీలో ఐబీఎస్ (ICFAI) యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీబీఏ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సుమారు 20 నుంచి 25 మంది విద్యార్థినులు సహా మొత్తం 25 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
పార్టీలో మద్యం సేవించినట్లు అనుమానంతో విద్యార్థులకు పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఫామ్‌హౌస్‌లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించిన వివరాలు, డ్రగ్స్ వినియోగం జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

