Bipasha Basu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హాటెస్ట్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది బిపాసా బసు (Bipasha Basu). టక్కరి దొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ఈ భామ జిస్మ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ బ్యూటీ సిల్వర్ స్రీన్‌పై కనిపించక ఐదేండ్లు దాటిపోయింది. టీవీ యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)ను పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది బిపాసాబసు. కొన్ని నెలల క్రితం బిపాసాబసు-కరణ్ సింగ్ గ్రోవర్ పండంటి పాపాయికి వెల్కమ్ చెప్పారని తెలిసిందే.
నేహా ధూపియాతో చేసిన చిట్ చాట్ సెషన్లో కూతురు దేవి (Devi)కి సంబంధించిన హృద్యమైన విషయాన్ని షేర్ చేసుకుంది బిపాసాబసు. తన కూతురు గుండెలో రెండు రంధ్రాలు ఏర్పడ్డాయని.. మూడు నెలల వయస్సులోనే తనకు సర్జరీ చేయించామని చెప్పింది. అయితే ఇంత భావోద్వేగపూరిత విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న బిపాసా బసుపై ఫాలోవర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దేవి వయస్సు 7 నెలలు కాగా.. ఆరోగ్యంగా ఉంది.