Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor) ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ (Animal) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 11న విడుదల కావాల్సింది. కానీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 1కి వాయిదా వేశారు. యానిమల్ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం రెండు సినిమాలకు బాగా కలిసొచ్చిందంటున్నారు సినీ జనాలు.
ప్రస్తుతం బీటౌన్ నుంచి గదర్ 2 (Gadar 2) , ఓ మై గాడ్ 2 (Oh My God 2) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. అయితే గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న యానిమల్ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాలతో కలిపి విడుదలై ఉంటే థియేటర్ల కొరత ఏర్పడటమే కాకుండా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపించేందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు, మూవీ లవర్స్. ఇండిపెండెన్స్ డే పోటీకి దూరంగా ఉండి యానిమల్ మేకర్స్ మంచి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అలా రణ్‌బీర్ కపూర్ తన సినిమాను వాయిదా వేసుకొని రెండు సినిమాలకు సపోర్ట్‌గా నిలిచాడన్నమాట.
Gadara 2
వైట్ కుర్తాలో రణ్‌బీర్‌కపూర్ రక్తపు మరకలతో ఉన్న లుక్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Oh My God