Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా లేకపోయినా, ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తరచూ తన లైఫ్‌కు సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఆమె దర్శకుడు రాజ్ నిడమోరు తో రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఇటీవల అమెరికా వెకేషన్‌కు కలిసి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల ఒకే కారులో వీరిద్దరూ కనిపించడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే ప్రచారం ఊపందుకుంది.
అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఆ ఫొటోలో ఆమె ఒంటరిగా ఓ కేఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించింది. కానీ ఆ ఫొటోలో అసలు హైలైట్ ఆమె చేతి వేలిపై ఉన్న ఓ ప్రత్యేకమైన రింగ్. ఈ రింగ్ ఓవల్ షేప్‌లో ఉండగా, ఆ రింగ్పైన స్టోన్ చుట్టూ డైమండ్లు అలంకరించి ఉన్నాయి. డిజైన్ చక్కగా ఉండడంతో పాటు లైటింగ్‌లో మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా ఆమె చేతికి ఇలాంటి ప్రత్యేకమైన రింగ్ కనిపించలేదు. ఇది చూస్తే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఈ రింగ్ రాజ్ నిడమోరు ఇచ్చిందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.
రాజ్-డీకే డైరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వంటి వెబ్‌సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అప్పుడు నుంచే రాజ్‌తో ఆమె స్నేహం మొదలై, ఆ సంబంధం నెమ్మదిగా ప్రేమగా మారిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సమంత నిర్మించిన శుభం సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం కూడా ఈ సంబంధాన్ని బలపరచినట్టు అంటున్నారు.అయితే ఇప్పటివరకు ఈ రూమర్లపై న సమంత గానీ, రాజ్ గానీ స్పందించింది లేదు. కాని రోజుకొక కొత్త పుకారు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.