Kingdom Movie | స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ జానర్లో సినిమా చేయడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మలయాళం నటుడు వెంకీటేశ్ కీలక పాత్రల్లో నటించారు.
ఖుషి, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి బ్యాక్టూ బ్యాక్ ఫ్లాప్ల తర్వాత ఎలాగైన హిట్టు కొట్టాలనే కసితో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేశాడు. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో కొత్త సినిమా వచ్చిందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా గౌతమ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. విజయ్, సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ టేక్ ఓవర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్కి దాదాపు 50 రోజులు పట్టవచ్చని సమాచారం.