ఆకాష్ మురళి, అదితిశంకర్ జంటగా ‘పంజా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ నెల 30న తెలుగులో విడుదల చేస్తున్నది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
నేటితరంలో యువతీయువకుల మధ్య ప్రేమసంబంధాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఈ సినిమాలో చూపించామని, యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు విష్ణువర్ధన్ తెలిపారు. నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలున్న చిత్రమిదని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశి పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరో ఆకాష్ మురళి తెలిపారు.