యువ హీరో హవీష్ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘నేను రెడీ’ అనే సినిమా రూపొందుతున్నది. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా నుంచి కావ్య థాపర్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలోని తన పాత్ర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని, తన కెరీర్లోనే ది బెస్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని కావ్య చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరి తేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్‌రెడ్డి, బలగం సత్యనారాయణ, రోహన్ రాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి.