చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నేహా శర్మ (Neha Sharma). అయితే ఈ భామకు సంబంధించిన ఓ సెల్ఫీ స్టిల్ మార్ఫింగ్ (morphed photo) చేసి అభ్యంతరంగా పోస్ట్ చేశారు ఆకతాయిలు. ఎవరో నేహాశర్మ స్టిల్ ను మార్ఫింగ్ చేసి బ్యాక్ గ్రౌండ్లో సెక్స్ టాయ్‌ను యాడ్ చేశారు. 2018లో ఇంటర్ నెట్లో రౌండప్ చేసిన ఈ ఫొటో వ్యవహారంపై స్పందించింది నేహాశర్మ. తాను నటిస్తోన్న వెబ్‌సిరీస్ ఇల్లీగల్ (Illegal) సెట్స్ లోకి వచ్చినపుడు, అందరూ తనతో వింతగా ప్రవర్తించినపుడు నేహా శర్మకు ఈ విషయం తెలిసిందట.
రేడియో జాకీ సిద్దార్థ్ కన్నన్ (Siddharth Kannan)తో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. నేను సెట్‌కి వచ్చాను. అందరూ కాస్త విచిత్రంగా, వింతగా ఉన్నారు. ఎవరూ మాట్లాడకుండా..అందరూ చర్చించుకుంటున్నారు. గునుగుతూ ఉన్నారు. అసలేం జరుగుతుంది. అందరూ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అని అనుకున్నా. చివరికి ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి నేహా, ఇదిగో నీ ఫోటో వైరల్ అవుతుందని చూపించారు.
నేను షాక్‌తో నోరు తెరిచి వావ్, చాలా క్రియేటివ్, ఎవరు చేసారో అని మొదట్లో బాధపడ్డాను. కానీ నిజం ఏమిటో నాకు తెలుసు. డ్యూడ్..ఇది చాలా చాలా వెర్రితనం. ఇలాంటి మార్ఫింగ్ పనులు మంచివి కావు. నేను చాలా యంగ్‌గా ఉన్నాను. నేను ఎందుకు, ఇలా ఎందుకు అని నాకు అనిపించింది. ఎవరైనా ఇలా ఇందుకు చేస్తారనిపించింది. ఎందుకు ఉద్యోగం లేకుండా ఇలాంటివి చేస్తున్నారు అంటూ ఆకతాయి నెటిజన్లకు ఘాటుగా చురకలంటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్