Naga Chaitanya | NC23 అప్డేట్.. మత్సకారులను కలిసిన నాగచైతన్య టీం
NC 23 | ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఇప్పుడు NC23కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. చైతూ డైరెక్టర్ చందూమొండేటి, బన్నీ వాసు టీంతో కలిసి శ్రీకాకుళంలో పర్యటించాడు.
NC 23 | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. NC22గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు NC23 కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. చైతూ డైరెక్టర్ చందూమొండేటి, బన్నీ వాసు టీంతో కలిసి శ్రీకాకుళంలో పర్యటించాడు. అక్కడి స్థానిక మత్స్యకారులను కలిసి వారి స్థితిగతులు, ఇతర విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు.
ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చైతూ నెక్ట్స్ చేయబోయే సినిమా ఫిషర్మెన్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని తాజా విజువల్స్‌తో అర్థమవుతున్నప్పటికీ.. NC23 ఎలాంటి కథతో ఉండబోతుందన్న దానిపై చందూమొండేటి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కార్తికేయ, సవ్యసాచి, కార్తికేయ 2, ప్రేమమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందూమొండేటి. ఇప్పటికే నాగచైతన్య-చందూమొండేటి కాంబినేషన్లో సవ్యసాచి, ప్రేమమ్ సినిమాలు వచ్చాయి.
NC23 వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కానుంది. పాపులర్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై తెరకెక్కించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.

Nc23
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

