Love Me Trailer | టాలీవుడ్ యంగ్ యాక్టర్ ఆశిష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లవ్మీ’ (Love Me Trailer). ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో బేబి ఫేం వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి తెరకెక్కిస్తున్నారు. లవ్ మీ మే 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆశిష్ అండ్ టీం.
ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ (Love Me Trailer) ను లాంఛ్ చేశారు. తనని చూస్తే నన్ను చంపేస్తుందేమో అని మీరు భయపడుతున్నారు..నన్ను చూశాక చంపకుండా వదిలేస్తుందేమో అని నేను భయపడ్తున్నాను..అంటూ ఆశిష్ చెప్తున్న డైలాగ్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇప్పటికే విడుదల చేసిన మూవీ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. .అనుకోని కారణాల వల్ల మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ కాగా.. లెజెండీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
లవ్ మీ ట్రైలర్..
లవ్ మీ టీజర్..