SRH vs GT : పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అడుగుదూరంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా ఉప్పల్ స్టేడియం తడిసిముద్దైంది.
సాయంత్రం ఐదు తర్వాత వాన తగ్గడంతో మైదానం సిబ్బంది ఔట్‌ఫీల్డ్‌లోని నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు వేయాల్సిన టాస్ ఆలస్యం కానుంది. ఔట్‌ఫీల్డ్‌లో తడి తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. ఒకవేళ 20 ఓవర్ల ఆట సాధ్యం కాకుంటే ఓవర్లు కుదించే అవకాశముంది. అప్పుడు 16 ఓవర్లు ఆడిస్తారా? అంతకంటే తగ్గిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Expect some good news later on ☔🤞
Stay tuned, #OrangeArmy! https://t.co/MWaxZcMoSF
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
ఈ సీజన్లో రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ ఏడు విజయాలు సాధించింది. ఈ రోజు గుజరాత్‌పై గెలిస్తే 16 పాయింట్లతో కమిన్స్ సేన ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకుంటుంది. మరోవైపు.. ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన నిరుడు రన్నరప్, 2022 విజేత గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.