Bala Krishna | ‘ఎన్బీకే 109’ సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల కారణంగా కొన్ని నెలలు ఈ సినిమా షూటింగ్‌కి విరామం ఇచ్చిన బాలకృష్ణ.. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా సెట్లోకి ఎంటరయ్యారు. ఓ నెలన్నర షూటింగ్‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమచారం.
బాలకృష్ణ, బాబీడియోల్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ సీన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ). ఈ సినిమాకు ‘ఊరమాస్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఊర్వశీ రౌటేలా, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.