టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni), బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఎన్బీకే 107వ (#nbk107) ప్రాజెక్టుగా వస్తోంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఈ అప్ డేట్‌ను నిజం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ ఇచ్చింది.
శాండల్ వుడ్ సెన్సేషన్ దునియా విజయ్‌కు స్వాగతం పలుకడం సంతోషంగా ఉంది అంటూ ట్విటర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. కన్నడలో విలన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పాపులర్ అయ్యాడు దునియా విజయ్. తెలుగులో చేస్తున్న మొదటి సినిమా కాగా..ఈ మూవీలో మళ్లీ విలన్ గా నటిస్తుండటం విశేషం. క్రాక్ లాంటి సూపర్ హిట్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా కావడం, మరోవైపు అఖండ భారీ హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 🎉😊
— Gopichandh Malineni (@megopichand) January 3, 2022
Redefines the Villainism with #NBK107 👍🏻
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu
కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. రిషీ పంజాబీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎన్బీకే 107 రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో షురూ కానుందని సమాచారం.