Nayanthara | నయనతారను అందరూ లేడీ సూపర్‌స్టార్ అని ఎందుకంటారో ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల లైనప్ చేస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ నయన్ చేతిలో 11 సినిమాలున్నాయి. ఇండియాలో ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న హీరోయిన్ కేవలం నయన్ మాత్రమే. నయన్ తీసుకుంటున్న పారితోషికం 10కోట్లని కోలీవుడ్ టాక్. అంటే.. ఒక్కో సినిమాకూ పదికోట్ల లెక్కన చూస్తే.. మొత్తంగా పారితోషికాల ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే 110కోట్లు సంపాదించనున్నదన్నమాట. దటీజ్ నయనతార. షారుక్‌ఖాన్ ‘జవాన్’ సినిమా పుణ్యమా అని బాలీవుడ్లో కూడా నయన్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అక్కడ్నుంచి కూడా కుప్పలుతెప్పలుగా అవకాశాలొస్తున్నాయి. సాధారణంగా నయన్ సినిమాలను అంత త్వరగా ఒప్పుకునే టైమ్ కాదు. నిర్మాతలకు సవాలక్షా కండీషన్లు పెట్టిగానీ ఒప్పుకోదు. అలాంటి నయనతార.. ఒకేసారి ఇన్ని సినిమాలను ఓకే చేయడం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. టెస్ట్, డియర్ స్టూడెంట్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మహారాణి.. వీటితోపాటు మమ్ముట్టి హీరోగా ఓ సినిమా, కన్నడంలో రెండు, మలయాళంలో రెండు, తాజాగా తమిళంలో మూడు సినిమాలకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.