చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?

ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ ‘మూకుతి అమ్మన్’ సినిమాలో చివరిసారిగా కనిపించిన నయనతార.. లూసిఫర్ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవితో నటించనున్నది. తెలుగు వెర్షన్‌కు మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. లూసిఫర్ రీమేక్‌లో నయనతార చేరడం గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నది. ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రం జనవరి 21 న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు మోహన్‌రాజాతో జతకట్టారు. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. రీమేక్‌లో మంజు వారియర్ పాత్రను నయనతార పోషించనున్నట్లు తెలిసింది. లూసిఫర్ తెలుగు వెర్షన్లో సుహాసిని, విజయశాంతి, జెనీలియా డిసౌజా, ఖుష్బు, నదియా, రమ్య కృష్ణతో పాటు పలువురు కథానాయికలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే, ఈ పాత్రకు నయనతార సరిగ్గా సరిపోతారని, ఈ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు సినిమా వర్గాలు చెప్తున్నాయి. తెలుగు పరిశ్రమ నివేదికల ప్రకారం, నయనతారా ఈ చిత్రం చేయడానికి అంగీకరించినప్పటికీ.. ఒప్పందంపై ఇంకా సంతకం చేయలేదు. ‘మూకుతి అమ్మన్’ హీరోయిన్ ఇంతకు ముందు తని ఒరువన్, వెలైకరన్ చిత్రాలలో మోహన్ రాజాతో కలిసి పనిచేసింది. ఆమె సైరా నరసింహరెడ్డిలో చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. లూసిఫర్ తెలుగు రీమేక్ జనవరి 21 న హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది. అయితే, ప్రధాన షూటింగ్ మార్చిలో మాత్రమే చేపట్టేలా ప్లాన్ చేసుకున్నారు. ఎన్వీ ప్రసాద్, కొణిదేల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో టోవినో థామస్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!