బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌తో దిల్ రాజు భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా హిందీ భాషలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
బ్లాక్‌బస్టర్ హిట్ ‘జవాన్’ తర్వాత నయనతార చేస్తున్న హిందీ చిత్రమిదే కావడం విశేషం. సల్మాన్-నయనతార జోడీ ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్‌ని తీసుకొస్తుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, రచన-దర్శకత్వం: వంశీ పైడిపల్లి.