Nayanthara | గ్లామరస్ రోల్స్, యాక్షన్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే టాలెంట్ నయనతార (Nayanthara) సొంతం. తన అందం, అభినయంతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది ఈ కేరళ సోయగం. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథాంశాలతో ప్రేక్షకులను పలుకరిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది నయనతార. ఉమెన్ సెంట్రిక్ కథాంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసే నయనతార కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ తెరపైకి వచ్చింది.
నయన్ తాజాగా మరోసారి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో సినిమా చేయనుంది. ఇంతకీ ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారో తెలుసా..? పాపులర్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ (DudeVicky) . ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రం జులై 14 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి నయనతార ఈ సారి యూట్యూబర్‌తో ఎలాంటి కథాంశంతో సినిమా చేయబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నయనతార ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ జవాన్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
Nayanthara’s Next Film⭐#Nayanthara‘s upcoming new film will be directed by Popular Youtuber #DudeVicky & Produced by Prince pictures 🎬💥
Movie launching on July-14 with a Pooja✨ pic.twitter.com/aDYCbWr2s8
— AmuthaBharathi (@CinemaWithAB) July 3, 2023